Search
Close this search box.

  నానికి జోడీగా మీనాక్షి చౌదరి.. ‘బ్లడీ రోమియో’పై క్రేజీ న్యూస్..!

September 29, 2026 7:48 PM | Aditya369 News

నానికి జోడీగా మీనాక్షి చౌదరి.. ‘బ్లడీ రోమియో’పై క్రేజీ న్యూస్..!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పనులు పూర్తయ్యాక.. నాని తన నెక్స్ట్ మూవీ ‘బ్లడీ రోమియో’ కోసం సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారు.

నాని, ‘సాహో’ ఫేమ్ సుజిత్ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చాలా కాలం క్రితమే ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే మధ్యలో సినిమా ఆగిపోయిందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఆ ప్రాజెక్ట్ ఆగిపోలేదని.. పనులు కొనసాగుతున్నాయని ఇటీవలే క్లారిటీ వచ్చింది.

ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘బ్లడీ రోమియో’లో నానికి జోడీగా మీనాక్షి చౌదరి నటించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం నాగచైతన్యతో ‘వృషకర్మ’ సినిమాలో నటిస్తున్న మీనాక్షి చౌదరికి.. నాని సినిమాలో కూడా ఛాన్స్ దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఇప్పటికే ‘బ్లడీ రోమియో’కు పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. అక్టోబర్ చివరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈలోపు దర్శకుడు సుజిత్ ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేయనున్నారట.

మరి నాని సరసన మీనాక్షి చౌదరి నిజంగానే నటిస్తారా? ఈ క్రేజీ కాంబినేషన్ తెరపై ఎలా ఉంటుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore