Search
Close this search box.

  NTR-త్రివిక్రమ్ కాంబోపై మరో బిగ్ అప్డేట్.. టైటిల్ మాత్రం సస్పెన్స్..!

September 29, 2026 7:40 PM | Aditya369 News

NTR-త్రివిక్రమ్ కాంబోపై మరో బిగ్ అప్డేట్.. టైటిల్ మాత్రం సస్పెన్స్..!

టాలీవుడ్‌లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ‘RRR’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను మరింత పెంచుకున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ఈ మూవీ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి పనిచేయబోతున్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోయే ఈ సినిమాకు ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అలాగే ఈ కథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేపథ్యంలో ఉంటుందనే వార్తలు కూడా గతంలో వినిపించాయి.

అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వయంగా కీలకమైన క్లారిటీ ఇచ్చారు. వెంకటేష్‌తో తాను తెరకెక్కించిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రివిక్రమ్‌ను.. ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమా గురించి ప్రశ్నించారు.

దీనికి సమాధానంగా తన తదుపరి సినిమా ఎన్టీఆర్‌తోనే ఉంటుందని త్రివిక్రమ్ తెలిపారు. అంతేకాదు.. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయిందని చెప్పారు. అయితే మూవీ టైటిల్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదని క్లారిటీ ఇచ్చారు.

దీంతో ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న ‘గాడ్ ఆఫ్ వార్’ అనేది ఫైనల్ టైటిల్ కాదనే విషయం దాదాపుగా స్పష్టమైంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

ప్రస్తుతం ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్‌లో బిజీగా ఉండగా.. ఈ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. మరి ఈసారి ఎన్టీఆర్‌ను త్రివిక్రమ్ ఎలాంటి కథతో చూపించబోతున్నారు? సినిమా టైటిల్ ఏంటి? అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore