Search
Close this search box.

  రజనీ ‘ధర్మన్’లో రామ్..! రాశీ ఖన్నా పోస్ట్‌తో బయటపడిన సీక్రెట్..!

September 29, 2026 7:37 PM | Aditya369 News

రజనీ ‘ధర్మన్’లో రామ్..! రాశీ ఖన్నా పోస్ట్‌తో బయటపడిన సీక్రెట్..!

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. రజనీ సర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధర్మన్’ షూటింగ్ ప్రస్తుతం మైసూర్‌లో శరవేగంగా జరుగుతోంది.

అయితే ఈ సినిమా సెట్స్ నుంచి హీరోయిన్ రాశీ ఖన్నా షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో రజనీకాంత్‌తో పాటు టాలీవుడ్ హీరో రామ్ పోతినేని కూడా కనిపించడంతో.. అసలు రామ్ ‘ధర్మన్’లో నటిస్తున్నాడా? అనే వార్తలకు మరింత బలం చేకూరింది.

ఇక మైసూర్‌లో తన డైలీ రొటీన్ గురించి రాశీ ఖన్నా సరదాగా చెప్పుకొచ్చారు. తెల్లవారుజామునే రజనీ సర్, రామ్‌తో కలిసి వర్కౌట్స్ చేయడం, ఆలయాలను సందర్శించడం, సరదాగా బయట తిరగడం, ఆటలు ఆడటం, ఫుల్‌గా నవ్వుకోవడంతో పాటు మైసూర్ దోశకు కూడా ప్రత్యేక స్థానం ఇచ్చానంటూ పోస్ట్ చేశారు.

కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ డాక్టర్ పాత్రలో కనిపించనుండగా, సిమ్రాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే చెన్నైలో మూడో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘ధర్మన్’ టీమ్.. ప్రస్తుతం మైసూర్‌లో నాలుగో షెడ్యూల్‌ను షూట్ చేస్తోంది. దాదాపు పది రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి రజనీతో పాటు రామ్ పోతినేని కూడా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ‘ధర్మన్’పై ఇప్పుడు మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore