Search
Close this search box.

  బాలయ్య–కొరటాల శివ సినిమాలో డబుల్ రోల్.. బిగ్ ట్విస్ట్ ఇదేనా..?

September 28, 2026 8:26 PM | Aditya369 News

బాలయ్య–కొరటాల శివ సినిమాలో డబుల్ రోల్.. బిగ్ ట్విస్ట్ ఇదేనా..?

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలో బాలకృష్ణ పోషించబోయే పాత్రలపై ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. బాలయ్య ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారనే టాక్ నడుస్తోంది. ముఖ్యంగా తండ్రి, కొడుకు పాత్రల్లో బాలకృష్ణ కనిపించబోతున్నారనే రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు.

ఇక ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను డిసెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ కోసం బాలయ్య సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారనే సమాచారం కూడా ఆసక్తిని పెంచుతోంది.

ప్రస్తుతం గాయం నుంచి బాలకృష్ణ వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉండబోతున్నట్లు టాక్. కథ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం.

‘దేవర’ తర్వాత కొరటాల శివ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో.. కథపై ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు సినిమాలో రాజకీయ అంశాలను కూడా కీలకంగా ప్రస్తావించనున్నారనే టాక్ వినిపిస్తోంది.

సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మరి బాలయ్య నిజంగానే తండ్రి, కొడుకు పాత్రల్లో కనిపిస్తారా? ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ఎప్పుడు బయటకు వస్తాయో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore