దక్షిణాది సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ సినిమాల్లో ‘జైలర్ 2’ కూడా ఒకటి. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ అవైటెడ్ సీక్వెల్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌తో పాటు వరల్డ్‌వైడ్ బిజినెస్, డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు కూడా వేగంగా పూర్తవుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా వినిపిస్తున్న బజ్ ప్రకారం.. ‘జైలర్ 2’కు ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.
ఈ లెక్కల ప్రకారం సినిమా బ్రేక్‌ఈవెన్‌కి చేరుకోవాలంటే వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ.650 నుంచి రూ.700 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక మొదటి భాగమైన ‘జైలర్’ బాక్సాఫీస్ దగ్గర రూ.600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌లో ప్రచారం జరిగింది. దీంతో సీక్వెల్‌పై కూడా అంచనాలు మరింత పెరిగాయి.
అయితే పార్ట్ 2కి మరింత భారీ టార్గెట్ ఉండటంతో.. సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరి నెల్సన్–రజినీకాంత్ కాంబినేషన్ మరోసారి అదే రేంజ్‌లో ప్రేక్షకులను మెప్పిస్తుందా? ‘జైలర్ 2’ పెట్టుకున్న భారీ బిజినెస్ టార్గెట్‌ను అందుకుంటుందా? అనేది సినిమా విడుదల తర్వాతే క్లారిటీ రానుంది.








