Search
Close this search box.

  చిరంజీవి కెరీర్‌లో తొలిసారి..! నెట్‌ఫ్లిక్స్‌తో మెగాస్టార్ సరికొత్త ప్రయోగం..!

September 28, 2026 8:11 PM | Aditya369 News

చిరంజీవి కెరీర్‌లో తొలిసారి..! నెట్‌ఫ్లిక్స్‌తో మెగాస్టార్ సరికొత్త ప్రయోగం..!

తెలుగు చిత్రసీమలో దాదాపు ఐదు దశాబ్దాలుగా అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

వెండితెరపై తన మాస్ ఇమేజ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి.. త్వరలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ఓ ప్రత్యేకమైన పాడ్‌కాస్ట్ సిరీస్ చేయబోతున్నారనే వార్త ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.

వాస్తవానికి చిరంజీవి జీవిత ప్రస్థానంపై ఓ డాక్యుమెంటరీ రూపొందించాలని తొలుత భావించారట. అయితే డాక్యుమెంటరీ కంటే పాడ్‌కాస్ట్ ద్వారా తన అనుభవాలను మరింత స్వేచ్ఛగా, నేరుగా ప్రేక్షకులతో పంచుకునే అవకాశం ఉంటుందని భావించినట్లు సమాచారం.

ఈ ఆలోచనను చిరంజీవి కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెల, ప్రముఖ రచయిత బీవీఎస్ రవి కలిసి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ కాన్సెప్ట్ చిరంజీవికి కూడా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఇక ఇప్పటికే పలు టాక్ షోలు, సంభాషణాత్మక కార్యక్రమాలకు పనిచేసిన అనుభవం ఉన్న బీవీఎస్ రవి.. ఈ పాడ్‌కాస్ట్‌కు రచన, కాన్సెప్ట్, డిజైన్ వంటి బాధ్యతలను చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ పాడ్‌కాస్ట్‌లో చిరంజీవి తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకోబోతున్నారట. ముఖ్యంగా సాధారణ ఇంటర్వ్యూల్లో పెద్దగా చెప్పని వ్యక్తిగత అనుభవాలు, సినీ కెరీర్‌లో ఎదురైన ఒడిదుడుకులు, స్టార్‌డమ్ వెనుక ఉన్న కష్టం.. ఇలా ఎన్నో విషయాలపై ఆయన స్వయంగా మాట్లాడనున్నట్లు సమాచారం.

అంటే వెండితెరపై మనం చూసిన మెగాస్టార్ వెనుక ఉన్న వ్యక్తి ఎలా ఎదిగారు? ఇండస్ట్రీలో దాదాపు ఐదు దశాబ్దాల ప్రయాణంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనే విషయాలను చిరంజీవి స్వయంగా చెప్పబోతున్నారన్నమాట.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు జరుగుతున్నట్లు తెలుస్తుండగా.. దీనిపై నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని సమాచారం.

మరి ఇప్పటివరకు సినిమాల్లోనే తన కథను చెప్పిన మెగాస్టార్.. ఈసారి తన జీవిత కథను తన మాటల్లో ఎలా చెబుతారో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore