పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మిగతా స్టార్ హీరోలతో పోలిస్తే సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్‌గా ఉండే ప్రభాస్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ డీపీ మార్చడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.
ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చినప్పటి నుంచి తన ప్రొఫైల్ పిక్చర్‌గా ‘బాహుబలి’లోని ఫోటోనే కొనసాగిస్తూ వచ్చారు. ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి భారీ సినిమాలు వచ్చినా కూడా ఆయన డీపీని మార్చలేదు. అయితే దాదాపు ఏడేళ్ల తర్వాత ఇప్పుడు తొలిసారి తన డీపీని మార్చారు.
తాజాగా ప్రభాస్ తన అప్‌కమింగ్ మూవీ ‘ఫౌజి’కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్ డీపీగా పెట్టుకున్నారు. దీంతో ఈ చిన్న మార్పు కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఇన్నేళ్ల తర్వాత ప్రభాస్ తన డీపీని మార్చడం, అది కూడా ‘ఫౌజి’ పోస్టర్‌తో మార్చడం ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.
దీంతో ‘ఫౌజి’ సినిమాపై ప్రభాస్‌కు ప్రత్యేకమైన ఆసక్తి ఉందా? ఈ ప్రాజెక్ట్‌ను ఆయన చాలా సీరియస్‌గా తీసుకున్నారా? అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే డీపీ మార్చడానికి అసలు కారణం ఇదేనని ప్రభాస్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం సినిమా ప్రమోషనల్ అప్‌డేట్స్‌తో అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
మొత్తానికి.. ప్రభాస్ ఏళ్ల తర్వాత మార్చిన ఇన్‌స్టాగ్రామ్ డీపీనే ఇప్పుడు నేషనల్ వైడ్‌గా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ‘బాహుబలి’ నుంచి ‘ఫౌజి’కి మారిన ఈ ఒక్క డీపీ.. సినిమాపై ఫ్యాన్స్‌లో మరింత క్యూరియాసిటీ పెంచేసింది.









