Search
Close this search box.

  Nagavamsi: సినిమా కలెక్షన్లపై నాగవంశీ కీలక వ్యాఖ్యలు.. అసలు లెక్కలు దాచడం కష్టమే!

August 8, 2026 6:18 PM | Aditya369 News

Nagavamsi: సినిమా కలెక్షన్లపై నాగవంశీ కీలక వ్యాఖ్యలు.. అసలు లెక్కలు దాచడం కష్టమే!

సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ కలెక్షన్లు, బడ్జెట్లు, ఆదాయ వ్యయాల లెక్కలపై ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ప్రభుత్వ శాఖలకు ఇప్పటికే పూర్తి స్థాయిలో సమాచారం ఉంటుందని, అలాంటప్పుడు కలెక్షన్ల విషయంలో ఏదైనా దాచాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగవంశీ.. పోస్టర్లపై ప్రచారం చేసే కలెక్షన్లకు, వాస్తవ వసూళ్లకు మధ్య తేడాలు ఉంటాయని పేర్కొన్నారు.

జీఎస్టీ, టీడీఎస్ వంటి పన్నుల విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమలో ఆర్థిక లావాదేవీలు గతంతో పోలిస్తే మరింత పారదర్శకంగా మారాయని నాగవంశీ తెలిపారు. ముఖ్యంగా జీఎస్టీ అమలు తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్స్ గణనీయంగా తగ్గాయని చెప్పారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా జీఎస్టీ ఇన్‌పుట్ ప్రయోజనాలను పొందేందుకు వీలైనంత వరకు బ్యాంకింగ్ మార్గాల్లోనే లావాదేవీలు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారని వివరించారు.

ఇక సినిమాల కలెక్షన్లను పెంచి చూపించడం వల్ల నిర్మాతలకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రయోజనం ఉండదని నాగవంశీ అభిప్రాయపడ్డారు. ఒక సినిమా వాస్తవంగా ఎంత వసూలు చేసిందనే విషయాన్ని ప్రభుత్వ విభాగాలు వివిధ మార్గాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను శాఖ వద్ద ఉన్న డేటా, ఆధునిక టెక్నాలజీ కారణంగా సినిమా పరిశ్రమలోని వాస్తవ ఆర్థిక లావాదేవీలను గుర్తించడం కష్టమైన విషయం కాదని చెప్పారు. దీంతో బాక్సాఫీస్ నంబర్ల విషయంలో జరుగుతున్న ప్రచారం, వాస్తవ లెక్కలపై నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు