2008 నవంబర్ 26న ముంబైపై జరిగిన 26/11 ఉగ్రదాడులు దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టాయి. ఉగ్రవాదులతో భద్రతా బలగాలు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సమయంలో.. ముంబైలోని కామా, అల్బ్లెస్ ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కూడా మరో రకమైన యుద్ధాన్ని ఎదుర్కొన్నారు. ఆయుధాలు లేకపోయినా తమ సంరక్షణలో ఉన్న రోగుల ప్రాణాలను కాపాడేందుకు వారు ప్రదర్శించిన ధైర్యం, తెగువ ఎంతో మందికి తెలియని కథగా మిగిలిపోయింది.
ఈ అజ్ఞాత వీరుల సాహసాలను వెండితెరపై ఆవిష్కరించిన చిత్రమే కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ‘భారత్ భాగ్య విధాత’ (Bharat Bhhagya Viddhaata). ఉగ్రదాడుల సమయంలో ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు, రోగులను రక్షించేందుకు వైద్య సిబ్బంది తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించారు. 26/11 ఘటనల నేపథ్యంలో సాగడంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
‘భారత్ భాగ్య విధాత’ 2026 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన ప్రేక్షకులకు ఇప్పుడు ఓటీటీ రూపంలో చూసే అవకాశం రాబోతోంది. దీంతో 26/11 దాడుల సమయంలో తెర వెనుక జరిగిన ఈ తెలియని పోరాటాన్ని ఇంట్లోనే చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందనే వివరాలపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.








