Search
Close this search box.

  ‘ది ప్యారడైజ్’లో మోహన్ బాబు పాత్రపై క్రేజీ టాక్..!

August 14, 2026 9:04 PM | Aditya369 News

‘ది ప్యారడైజ్’లో మోహన్ బాబు పాత్రపై క్రేజీ టాక్..!

,సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు గత కొన్నేళ్లుగా సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించకుండా, తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులకే ఓకే చెబుతూ వస్తున్నారు. ‘బుజ్జిగాడు’, ‘యమదొంగ’, ‘మహానటి’ వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే ఇటీవల ఘట్టమనేని వారసుడు జయకృష్ణ అరంగేట్రం చేసిన ‘శ్రీనివాస మంగాపురం’లో మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ముఖ్యంగా ఇందులో మోహన్ బాబు పాత్రను పూర్తిస్థాయిలో డిజైన్ చేయలేదనే అభిప్రాయం వ్యక్తమైంది.

వరుసగా పలు ప్రాజెక్టులను తిరస్కరించిన మోహన్ బాబు.. ఇలాంటి సినిమాను ఎందుకు ఎంచుకున్నారనే చర్చ కూడా ట్రేడ్ వర్గాల్లో జరిగింది. అయితే ఇప్పుడు ఆయన మరోసారి పవర్‌ఫుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

నాచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’లో మోహన్ బాబు అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన క్యారెక్టర్ కథలో కీలక మలుపు తీసుకురావడమే కాకుండా, సినిమాపై భారీ ప్రభావం చూపించేలా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే విడుదలైన మోహన్ బాబు ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. నటుడిగా మోహన్ బాబు కెరీర్‌లో ‘ది ప్యారడైజ్’ ఒక కీలకమైన చిత్రంగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు