దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
ఈ సినిమాలో ప్రియాంక మందాకిని పాత్రలో కనిపించనుండగా, మహేష్ బాబు రుద్రగా, శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా శ్రీరాముడి పాత్ర ఉండటంతో, హనుమంతుడి పాత్ర కూడా కీలకంగా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో హనుమంతుడి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇక ‘వారణాసి’ క్లైమాక్స్‌ను భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో చిత్రీకరించనున్నట్లు సమాచారం. సుమారు రూ.1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ప్రముఖ నిర్మాతలు కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి అందిస్తుండగా, కథను విజయేంద్ర ప్రసాద్ రూపొందించారు. సంభాషణలను దేవా కట్టా రాస్తున్నారు.
మొత్తానికి ‘వారణాసి’ చిత్రం భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించే విజువల్ వండర్‌గా నిలవబోతోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.









