రెబెల్ స్టార్ ప్రభాస్, డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘స్పిరిట్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ కాప్ పాత్రలో కనిపించనుండటంతో సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది.
తాజాగా KJQ సినిమా టీమ్‌తో జరిగిన ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ షూటింగ్‌కు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. నాలుగు, ఐదు రోజుల క్రితం వరకు ఎలాంటి గ్యాప్ లేకుండా సినిమా చిత్రీకరణలో పాల్గొన్నానని, ప్రస్తుతం షూటింగ్‌కు సంబంధించి సుమారు నెల రోజుల పాటు తాత్కాలికంగా విరామం తీసుకున్నట్లు తెలిపారు. ఈ బ్రేక్ అనంతరం కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు.
‘స్పిరిట్’ పనులు అద్భుతంగా కొనసాగుతున్నాయని, సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో, తాము కూడా అంతే ఉత్సాహంతో పనిచేస్తున్నామని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు. చిన్న విరామం తర్వాత మరింత జోరుగా తదుపరి సుదీర్ఘ షెడ్యూల్‌ను పూర్తి చేసేందుకు టీమ్ సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా, దివంగత KJQ దర్శకుడు కిరణ్ జ్ఞాపకార్థం ఆయన అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో కలిసి త్వరలో ప్రత్యేక సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సందీప్ తెలిపారు.









