Search
Close this search box.

  Sujatha Vijayakumar: రూ.40 లక్షల మెయింటెనెన్స్ ఎందుకు కోరామో వెల్లడించిన సుజాత విజయ్‌కుమార్

August 3, 2026 10:54 PM | Aditya369 News

Sujatha Vijayakumar: రూ.40 లక్షల మెయింటెనెన్స్ ఎందుకు కోరామో వెల్లడించిన సుజాత విజయ్‌కుమార్

తమిళ హీరో రవి మోహన్, ఆయన భార్య ఆర్తి రవి విడాకుల వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ వ్యవహారంపై ఆర్తి రవి తల్లి, ప్రముఖ నిర్మాత సుజాత విజయ్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రవి మోహన్ నుంచి నెలకు రూ.40 లక్షల మెయింటెనెన్స్‌ను ఎలాంటి కారణం లేకుండా కోరలేదని ఆమె స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్తు, కుటుంబ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే ఈ మొత్తాన్ని కోరినట్లు తెలిపారు.

గత రెండేళ్లుగా పిల్లల స్కూల్ ఫీజులు, ఆహారం, ట్యూషన్, ఇతర ఖర్చులకు సరైన ఆర్థిక సహాయం అందలేదని సుజాత పేర్కొన్నారు. పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచే అమెరికన్ స్కూల్‌లో చదువుతున్నారని, ఇది తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయమని చెప్పారు. ఏడాదికి వారి స్కూల్ ఫీజులు సుమారు రూ.86 లక్షలు ఉంటాయని, ఆ ఫీజులను చెల్లించాలని కోర్టు ఆదేశించిందని వెల్లడించారు. ఇంటికి ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి నోటీసు వచ్చిన పరిస్థితి కూడా ఎదురైందని తెలిపారు.

రవి మోహన్ పిల్లలను కలవకుండా తాము ఎప్పుడూ అడ్డుకోలేదని సుజాత స్పష్టం చేశారు. పిల్లలను కలిసేందుకు విజిటేషన్ రైట్స్ కోసం తామే కోర్టును ఆశ్రయించామని, ఆగస్టు నుంచి ప్రతి శని, ఆదివారాల్లో వారిని కలిసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కుటుంబ విషయాలను బహిరంగంగా చర్చించడం ఎవరికీ మంచిది కాదని, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ఆర్తి తన కుటుంబాన్ని తిరిగి ఒక్కటి చేసుకోవాలనే ఉద్దేశంతోనే పోరాడుతున్నారని తెలిపారు. తాను నిర్మాతగా స్వతంత్రంగా ఎదిగానని, రవి మోహన్ సినిమాల్లో రూ.100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు సుజాత వెల్లడించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు