Search
Close this search box.

  లెనిన్ సక్సెస్‌తో భాగ్యశ్రీ బోర్సే రేంజ్ మారిందా..? భారీగా పెరిగిన రెమ్యునరేషన్..!

July 18, 2026 2:15 PM | Aditya369 News

లెనిన్ సక్సెస్‌తో భాగ్యశ్రీ బోర్సే రేంజ్ మారిందా..? భారీగా పెరిగిన రెమ్యునరేషన్..!

వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొన్న అందాల భామ భాగ్యశ్రీ బోర్సేకు ఎట్టకేలకు గట్టి బ్రేక్ దక్కింది. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ యంగ్ బ్యూటీ, ఆ తర్వాత నటించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా, తన నటనతో మాత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

తాజాగా విడుదలైన ‘లెనిన్’ సినిమా భాగ్యశ్రీ కెరీర్‌కు కీలక మలుపుగా మారింది. ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచీ ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ విజయంతో నిర్మాతల దృష్టి మళ్లీ ఆమెపై పడిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం భాగ్యశ్రీ చేతిలో ఇప్పటికే మూడు సినిమాలు ఉండగా, కొత్త ఆఫర్లు కూడా వరుసగా వస్తున్నాయని సమాచారం. ఇదే సమయంలో ఆమె తన పారితోషికాన్ని కూడా పెంచినట్లు టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. గతంలో ఒక్కో సినిమాకు రూ.1.5 కోట్లు తీసుకున్న భాగ్యశ్రీ, ఇప్పుడు కొత్త ప్రాజెక్టుల కోసం రూ.2.5 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

తెలుగు సినిమాలకే తొలి ప్రాధాన్యం ఇస్తున్న భాగ్యశ్రీ, ఇతర భాషల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం శివకార్తికేయన్ సరసన ‘సేయోన్’ చిత్రంలో నటిస్తూ తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతోంది. వరుస అవకాశాలతో బిజీగా మారిన ఈ యంగ్ హీరోయిన్, రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు