Search
Close this search box.

  ‘వారణాసి’ నుంచి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్..! సోషల్ మీడియాలో వైరల్..!

July 18, 2026 2:07 PM | Aditya369 News

‘వారణాసి’ నుంచి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్..! సోషల్ మీడియాలో వైరల్..!

భారతీయ సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న 'వారణాసి' కూడా ఒకటి. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రెజెంట్ చేస్తున్న మేకర్స్ తరచూ ఆసక్తికరమైన అప్డేట్స్‌తో అభిమానుల్లో అంచనాలను మరింత పెంచుతున్నారు.

 

తాజాగా తెల్లవారుజామున చిత్రబృందం మరో క్రేజీ సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమా నుంచి హీరోయిన్ ప్రియాంక చోప్రాకు సంబంధించిన రెండు కొత్త పోస్టర్లను అంతర్జాతీయ మీడియా ద్వారా విడుదల చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

ఒక పోస్టర్‌లో ప్రియాంక చోప్రా స్టైలిష్, గ్లామరస్ లుక్‌లో కనిపించగా, మరో పోస్టర్‌లో క్యాజువల్, చిల్ మూడ్‌లో ఆకట్టుకుంది. ఈ అనూహ్య అప్డేట్ అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది.

 

ఇక ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండగా, ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. కార్తికేయ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.

భారతీయ సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వారణాసి’ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రెజెంట్ చేస్తున్న మేకర్స్ తరచూ ఆసక్తికరమైన అప్డేట్స్‌తో అభిమానుల్లో అంచనాలను మరింత పెంచుతున్నారు.

 

తాజాగా తెల్లవారుజామున చిత్రబృందం మరో క్రేజీ సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమా నుంచి హీరోయిన్ ప్రియాంక చోప్రాకు సంబంధించిన రెండు కొత్త పోస్టర్లను అంతర్జాతీయ మీడియా ద్వారా విడుదల చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

ఒక పోస్టర్‌లో ప్రియాంక చోప్రా స్టైలిష్, గ్లామరస్ లుక్‌లో కనిపించగా, మరో పోస్టర్‌లో క్యాజువల్, చిల్ మూడ్‌లో ఆకట్టుకుంది. ఈ అనూహ్య అప్డేట్ అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది.

 

ఇక ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండగా, ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. కార్తికేయ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు