Search
Close this search box.

  ప్రభాస్ ఫౌజీ vs బాలీవుడ్ స్టార్ హీరోలు.. బాక్సాఫీస్ పోరుకు రంగం సిద్ధం..!

July 18, 2026 2:18 PM | Aditya369 News

ప్రభాస్ ఫౌజీ vs బాలీవుడ్ స్టార్ హీరోలు.. బాక్సాఫీస్ పోరుకు రంగం సిద్ధం..!

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ అందించారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ‘ఫౌజీ’ సినిమా రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ప్రభాస్ ఈ సినిమాలో ఓ సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ తెచ్చుకున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

అయితే ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ ప్రకటించడంతో బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన పోటీకి తెరలేచింది. ప్రభాస్ సినిమా డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుండగా, అదే వీకెండ్‌లో బాలీవుడ్ నుంచి కూడా భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

డిసెంబర్ 4న అజయ్ దేవ్గన్, సంజయ్ దత్, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘రేంజర్’తో పాటు, అనీస్ బజ్మీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ నటిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ కూడా థియేటర్లలోకి రాబోతున్నాయి. దీంతో హిందీ మార్కెట్‌లో గట్టి పోటీ తప్పదనే టాక్ వినిపిస్తోంది.

‘ది రాజా సాబ్’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న మరో ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ కావడంతో ‘ఫౌజీ’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మరి ప్రభాస్ సైనికుడి పాత్రలో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడు? బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల మధ్య ‘ఫౌజీ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు