మొంథా తుఫాన్ ప్రభావం పట్ల పిఠాపురం నియోజకవర్గంలోని తీర ప్రాంత మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇన్‌ఛార్జి వర్మ సూచించారు.ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల్లో వర్మ పర్యటించారు. మొంథా తుఫాన్ అనేది ప్రమాదకర తుఫాన్ అని ప్రభుత్వం చెబుతున్నందున అంతా అలర్ట్ అయ్యారని గుర్తుచేశారు.తీర ప్రాంత ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వేటకు వెళ్లొద్దని, పునరావస కేంద్రాల్లో సురక్షితంగా ఉండాలని మత్స్యకారులను వర్మ కోరారు.









