టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకదాని తర్వాత ఒకటి భారీ సినిమాలను లైన్లో పెడుతూ కెరీర్లో నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నారు. తాత్కాలికంగా “డ్రాగన్” అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమా తర్వాత దేవర పార్ట్ 2 పనుల్లో ఎన్టీఆర్ బిజీ కానున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా ఓ భారీ ప్రాజెక్ట్‌కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ, స్క్రిప్ట్ పనులను త్రివిక్రమ్ పూర్తి చేశారనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
ఇక మే 20న ఎన్టీఆర్ తన పుట్టినరోజు జరుపుకోబోతున్న నేపథ్యంలో అభిమానులు వరుస అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబో మూవీ నుంచి భారీ సర్ప్రైజ్ రాబోతుందనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సినిమాకు “God of War” అనే పవర్ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఓ స్పెషల్ అనౌన్స్మెంట్ వీడియో విడుదల చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వీడియోలో సినిమా కాన్సెప్ట్‌కు సంబంధించిన హింట్ లేదా ఎన్టీఆర్ లుక్‌ను రివీల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
హై స్టాండర్డ్ విజువల్స్, గ్రాండ్ ప్రెజెంటేషన్‌తో ఈ అనౌన్స్మెంట్ వీడియోను త్రివిక్రమ్ ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు కూడా ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమా సుబ్రమణ్య స్వామి కథా నేపథ్యంతో తెరకెక్కబోతుందనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. మిథాలజీ టచ్‌తో కూడిన భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో మే 20న వచ్చే అధికారిక అప్డేట్తో క్లారిటీ రానుంది.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న “డ్రాగన్” మూవీకి సంబంధించిన గ్లింప్స్ వీడియో కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈసారి ఎన్టీఆర్ బర్త్‌డేను అభిమానులు డబుల్ ట్రీట్‌తో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు.







