బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక జంటగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఛావా’. ఈ సినిమా ఛత్రపతి శివాజీ కొడుకు శాంభజీ మహారాజ్ బయోపిక్ గా తెరకెక్కింది.. ఈ సినిమా ఇటీవలే విడుదలై బాలీవుడ్ బాక్స్ ఆఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.. దీంతో ఈ సినిమాలో విక్కీ కౌశిల్ నటనకు బాలీవుడ్ ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు..
ఈ సినిమా చూడడానికి బ్రహ్మరథం పడుతున్నారు.
బాలీవుడ్లో ఈ సినిమా ఇంకా కూడా విజయవంతంగా నడుస్తుంది.. వసూళ్లు కూడా అదే రేంజ్లో వస్తున్నాయి.. ఈ సినిమా బాలీవుడ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేవలం కొన్ని థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఫిదా అవ్వడంతో తెలుగులో కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది.. ఐతే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా హిందీ లో రిలీజ్ అవ్వడంతో అర్థం అవ్వడం లేదు అని. తెలుగులో రిలీజ్ చెయ్యమ్మని తెలుగు ప్రేక్షకులు నెట్టింట వైరల్ చేయడం వల్ల “చావా” యూనిట్ ఈ దీని పై స్పందించి తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. మార్చి 7 న ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయబోతున్నట్టు వెల్లడించింది. దాంతో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను చూడానికి ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు.. ఐతే ఈ సినిమాకు తెలుగులో డబ్బింగ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..ఈ సినిమాకు సంగీతం ఎ.ఆర్ రెహ్మను అందించారు..









