Search
Close this search box.

  క్రేజీ కాంబో.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ప్రభాస్ “రాక్షస”..?

‌రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఒక సినిమా తర్వాత ఒక సినిమా ఓకే చేస్తూ తన లైనప్ ను సాలిడ్ గా మారుస్తూ.. బాక్స్ ఆఫీసు వద్ద రికార్డు లను క్రియేట్ చేస్తున్నాడు.. ఇప్పటికే ప్రభాస్ 5 ప్రాజెక్ట్స్ బిజీగా ఉన్నాడు.. అందులో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో కల్కి సీక్వెల్.. మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్, హను రాఘవపూడి డైరెక్షన్లో ఫౌజి, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ 2 చేస్తున్నాడు.. కన్నప్ప సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు.. బాహుబలి సినిమా తరువాత సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తా అని ఫ్యాన్స్ కు ప్రభాస్ మాటిచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం. ప్రభాస్ సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ చేస్తూ మిగతా పాన్ ఇండియాను స్టార్స్ ను ఆశ్చర్య పరుస్తున్నాడు.. ఇది ఇలా ఉండగా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ప్రభాస్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ఓకే చెప్పినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఆ క్రేజీ ప్రాజెక్టు ఏంటి అంటే. ఆ క్రేజీ ప్రాజెక్ట్ పేరు “రాక్షస”. అవునండీ.. పోయినా సంక్రాంతికి హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ప్రభాస్ సినిమా చేయబోతున్నాట్లు వార్తలు నెట్టింట వైరల్ మారాయి.. ఐతే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ముందుగా బాలీవుడ్ హీరో రణబీర్ సింగ్ ను అనుకున్నారట.. హైదరబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సెట్ లో లుక్ టెస్ట్ కూడా చేసారు.. కానీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కు రణ్వీర్ సింగ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల రణ్వీర్ సింగ్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు. దాంతో ప్రశాంత వర్మ ఈ ప్రాజెక్టు ఆపేసి హనుమాన్ సీక్వెల్ మొదలు పెట్టాడు.. హనుమాన్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరడంతో ప్రభాస్ ను కలిసి స్టోరీ చెప్పడంతో ఒకే చెప్పడాని సినీ వర్గాల్లో టాక్. ఐతే ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో లుక్ టెస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.. చూడాలి మరి ప్రశాంత్ వర్మ ప్రభాస్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏ రేంజిలో ఉండబోతుంది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు