సామర్లకోట మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులపై రాజకీయ వేధింపులు మా నుకోవాలని,ఇతర మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని మార్చి 3 న జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు పెద్దఎత్తున కార్మికులు తర లిరావాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు మధు పిలుపునిచ్చారు.స్థానిక మున్సిపల్ కార్యాల యం వద్ద కార్మికులు నిర్వహిం చిన ధర్నాలో మధు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆప్కాస్ ను రద్దుపరిస్తే మున్సిపల్ శాఖ కి ఆ బాధ్యతలు అప్పగించాలని,కనీస వేతనం రూ.35వేలు చెల్లించాలని,మున్సిపల్ ఉద్యోగ కార్మికుల వేతనాలు చెల్లిం పు,పనులు అప్పగింత నిర్వహణ,సాంఘిక భద్రత మున్సిపల్ శాఖకే పూర్తి బాధ్యతలు ఉండాలని, ప్రైవేట్ కంపెనీ ఏజెన్సీలకు అప్పగించొద్దని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి పెడిరెడ్ల సత్యనారాయణ, మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు.









