ఫిబ్రవరి 28న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను సభలో ప్రవేశ పెట్టనున్నారు. అసలు అయితే ఈ బడ్జెట్‌ను మార్చి 4వ తేదీన ప్రవేశ పెట్టాలని ముందుగా నిర్ణయించారు.కానీ బడ్జెట్‌ను నాలుగు రోజుల ముందు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.24వ తేదీ నుండి బడ్జెట్ సమావేశాల ప్రారంభమవుతోన్న నేపథ్యంలో ఆ రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.అలాగే 25వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభం కానుంది.అదే రోజు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు.









