వైస్ చైర్మన్ ఎన్నికకు కోరం లేకపోవడంతో రేపటికి వాయిదా వేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఒక ప్రకటనలో తెలిపారు.తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహణకు డీపీవో ఎన్నికల అధికారిగాను, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాను ఎన్నిక పరిశీలకుడిగా నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. సోమవారం ఉదయం జరిగిన సమావేశానికి కోరం లేకపోవడంతో మంగళవారంకి వాయిదా వేయడం జరిగిందన్నారు. ప్రజాస్వామ్యంలో కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని, ఎటువంటి సమస్యలు ఉన్నా జిల్లా అధికార యంత్రాంగానికి తెలియజేయవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.









