తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతున్న దృష్ట్యా మున్సిపాలిటీ పరిధిలో సెక్షన్ 163(2) బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఐదుగురు వ్యక్తులు కంటే ఎక్కువ గుమ్మిగుడా కూడదని,సభలు, సమావేశాలు పెట్టకూడదని,కర్రలు, రాళ్లు,అగ్ని ప్రమాదాలు సంభవించే వస్తువులు,ఇతర ఆయుధాలు పట్టు కుని తిరగడాన్ని నిషేధించడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వులు 17/2/2025ఉదయం 6:00గం నుండి సాయంత్రం 6:00గం వరకు అమలులో ఉంటాయన్నారు.ప్రజలు ఎవరు సమావేశాలు నిర్వహిం చడం,గుంపులు గుంపులుగా తిరగడం, ఆయుధాలతో సంచరించడం చేయకూడదని ఈ విషయాన్ని గమనించాలన్నారు.









