ఒకరు రక్తదానం చేయడం వల్ల పలువురికి ప్రాణం దానం చేసిన వారవ్వుతా రని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ అన్నారు.హెల్మెట్ ధరించడం వల్ల చాలావరకు ప్రాణ నష్టం తగ్గుతుందని చెప్పారు.జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 36వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు సందర్భంగా కాకి నాడ సంజయ్ నగర్ లో ఉన్న లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమనికి జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి తాను కూడా రక్తదానం చేశారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగడం వల్ల ఎక్కువమంది మృతి చెందుతున్నారని వేగం తగ్గించి నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి,రోటరీ క్లబ్,రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులకు సేకరించిన రక్తంను అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి కె శ్రీధర్,కాకినాడ డిఎస్పి మనీష్ దేవరాజ్ పాటిల్,డిఎంహెచ్ఓ జె నరసింహ నాయక్, ట్రాఫిక్ సిఐ రమేష్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి మురళీకృష్ణ,రోడ్ సేఫ్టీ సభ్యురాలు కాంతం, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ,పావని,రవాణా, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









