రాష్ట్రంలోని భూమి గల ప్రతి రైతుకు ఒక ప్రత్యేక రైతు గుర్తింపు సంఖ్యనుకేటాయించి ఈ సంఖ్య ద్వారా రైతులకు వ్యవసాయ సేవలను సులభతరం చేయనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. పారదర్శకంగా అందుబాటులోకి తీసుకురావడానికి రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సమన్వయంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్తంగా కలిసి ఈ కార్యక్రమాన్నీ చేపట్టనున్నారు.
– గుర్తింపు సంఖ్యతో ప్రయోజనాలెన్నో.
ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు,ఇతర వ్యవసాయ సంబంధిత సేవలను పొందడానికి ఈ సంఖ్య అధికారిక గుర్తింపుగా పనిచేస్తుంది.భూ ఆధారిత పథకాలైన పీఎం కిసాన్,అన్నదాత సుఖీభవ,పంటల భీమా,పంట రుణాలపై వడ్డీ రాయితీ,రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు,సూక్ష్మ పోషకాలు,సూక్ష్మసేద్యం పై రాయితీ,పంట రుణాలు, పెట్టుబడి సాయం తదితర పథకాలు నేరుగా పొందే వీలు కలుగుతుంది.సత్వర పరిహారం అందించు టకు,నీటిపారుదల,తెగుళ్ళ నియంత్రణ,వాతావరణ సూచనలు వంటి ఇతర సేవలు అందుకోవడానికి తోడ్పడుతుంది.ప్రస్తుతం రాష్ట్రంలో భూమి గల ప్రతి రైతుకు, మున్ముందు కౌలు రైతులకు, భూములేని వ్యవసాయ కూలీలు,ఇతర వ్యవసాయ ఆధారిత వృత్తులలో ఉన్న వారికి ఇది వర్తిస్తుంది.
– రైతు గుర్తింపు సంఖ్య నమోదు విధానం
రైతులు 1) ఆధార్ నెంబర్, 2)ఆధార్ అనుసంధారిక ఫోన్ నెంబర్ 3) భూమి రికార్డులు వివరములు (పట్టాదారు పాస్ బుక్) తీసుకొని గ్రామంలో రైతు సేవా కేంద్రంలో సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేయడం ద్వార ప్రత్యేక గుర్తింపు సంఖ్యను పొందవచ్చు.