జిల్లాలో అసంఘటిత కార్మికులందరూ ఈ-శ్రమ్ పోర్టల్ లోనమోదు చేసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అన్నారు.వివిధ రంగాల కార్మిక సంఘాల ప్రతినిధులు,సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో నమోదు ద్వార సామాజిక భద్రతతో పాటు వివిధ కార్మిక సంక్షేమ పథకాలు పొందేందుకు వీలుఉందన్నారు.నమోదైన ప్రతీ కార్మికుడికి 1సం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం ఉచితంగా పొందవచ్చన్నారు.
