కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో వైసీపీకి చెందిన ముగ్గురు మహిళా కౌన్సిలర్లు టీడీపీ గూటికి చేరారు. ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు వారికి టిడిపీ కండువాలు వేశారు. వైసీపీపై అసంతృప్తితోనే టీడీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.పార్టీలో చేరిన వారిలో 4 వార్డు కౌన్సిలర్ తుమ్మలపల్లి సుశీల, 23 వ వార్డు కౌన్సిలర్ కర్రీ శ్రీదేవి, 28 వ వార్డు కౌన్సిలర్ చింతకాయల భారతి ఉన్నారు. ఈ నెల 3న జరగాల్సిన తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను టీడీపీ శ్రేణులు అడ్డుకోవటంతో ఎన్నిక వాయిదా పడింది. ప్రస్తుతం ఈచేరికల వ్యవహారం మలుపు తిప్పుతోంది.గత మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డుల్లోనూ వైసీపీ జెండా ఎగురవేసింది.
