Search
Close this search box.

  తిరుపతి తొక్కిసలాటకు అసలు కారణం.. కీలక విషయాలు వెల్లడించిన సిఎం చంద్రబాబు..

January 9, 2025 9:48 AM | Aditya369 News

తిరుపతి తొక్కిసలాటకు అసలు కారణం.. కీలక విషయాలు వెల్లడించిన సిఎం చంద్రబాబు..

తిరుపతిలో పెను విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి దర్శనం కోసం జారీ చేసే టోకెన్లు పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోగా .. మరి కొంత మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. టీటీడీ, జిల్లా అధికారులు ఈ ఘటన పైన సీఎం చంద్రబాబుకు ప్రాధమిక నివేదిక ఇచ్చారు. కీలక అంశాలను ప్రస్తావించారు.

ప్రాధమిక నివేదికలో

తిరుపతిలో జరిగిన విషాదం పైన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రాధమిక నివేదిక సమర్పించారు. ఇందులో ఘటన వెనుక చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. వైకుంఠ ఏకాదశి కోసం ప్రతీ ఏటా తరహాలోనే తిరుపతిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసారు. టోకెన్ల జారీ సమయానికి ముందే పెద్ద సంఖ్యలో కౌంటర్ల వద్దకు భక్తులు చేరుకున్నారు. తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో ఏకంగా 90 టోకెన్‌ జారీ కౌంటర్లను ఏర్పాటు చేశారు. పలుచోట్ల తొక్కిసలాట జరిగింది. అందులో... బైరాగిపట్టెడ కేంద్రం వద్ద పరిస్థితి చేయి దాటింది.

బాధ్యత ఎవరిది

ఈ కేంద్రం వద్ద రద్దీలో ఇరుక్కుపోయిన భక్తులు ఊపిరాడక అల్లాడిపోయారు. కాగా ఆ సమయంలో ఒక భక్తుడికి బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పడంతో గేట్లు ఓపెన్ చేశారు. వెంటనే మిగిలిన భక్తులు కూడా గేటు మీద పడటంతో తొక్కిసలాట జరిగిందని అధికారులు వెల్లడించారు. అయితే, అక్కడ డీఎస్పీ సరైన రీతిలో స్పందించని కారణంతో పాటుగా భక్తులతో విధుల్లో ఉన్న టీటీడీ, పోలీసు సిబ్బంది సరిగ్గా వ్యవహరించలేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ఘటన జరిగిన వెంటనే అందుబాటులో ఉన్న అంబులెన్సుల నిర్వాహకుల పైన ఫిర్యాదులు ఉన్నాయి. గాయపడిన వారిని సకాలంలో ఆస్పత్రికి తీసుకురాక పోవటంతో ప్రాణాపాయం ఏర్పడిందని చెబుతున్నారు.

ఘటన జరిగిన వెంటనే

ఘటన జరిగిన సమయంలో టీటీడీ, పోలీసు అధికారుల మధ్య సమన్వయం లోపం ఏర్పడిందని స్థానికులు వివరిస్తున్నారు. అయితే, ఇది అధికారుల వైఫల్యంగా టీటీడీ ఛైర్మన్ పేర్కొన్నారు. ఆరు లక్షల మందికి వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శనం కల్పిస్తామని.. టోకెన్ ఉన్నవారికే దర్శనం కు అనుమతిస్తామని పదే పదే చెప్పటంతో పెద్ద సంఖ్యలో భక్తులు టోకెన్ల కోసం తరలి వచ్చారు. కాగా, గతంలోనూ తొక్కిసలాట ఘటనలు ఉన్నాయి. కానీ, ప్రాణ నష్టం జరగలేదు. గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో యంత్రాంగం విఫలమైందనే ఆరోపణ లు ఉన్నాయి. దీంతో, ఈ రోజు తిరుపతి వస్తున్న చంద్రబాబు ఘటనకు విచారణకు ఆదేశించటం తో పాటుగా బాధితులకు పరిహారం ప్రకటించే అవకాశం ఉంది.

తిరుపతిలో పెను విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి దర్శనం కోసం జారీ చేసే టోకెన్లు పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోగా .. మరి కొంత మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. టీటీడీ, జిల్లా అధికారులు ఈ ఘటన పైన సీఎం చంద్రబాబుకు ప్రాధమిక నివేదిక ఇచ్చారు. కీలక అంశాలను ప్రస్తావించారు.

ప్రాధమిక నివేదికలో

తిరుపతిలో జరిగిన విషాదం పైన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రాధమిక నివేదిక సమర్పించారు. ఇందులో ఘటన వెనుక చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. వైకుంఠ ఏకాదశి కోసం ప్రతీ ఏటా తరహాలోనే తిరుపతిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసారు. టోకెన్ల జారీ సమయానికి ముందే పెద్ద సంఖ్యలో కౌంటర్ల వద్దకు భక్తులు చేరుకున్నారు. తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో ఏకంగా 90 టోకెన్‌ జారీ కౌంటర్లను ఏర్పాటు చేశారు. పలుచోట్ల తొక్కిసలాట జరిగింది. అందులో… బైరాగిపట్టెడ కేంద్రం వద్ద పరిస్థితి చేయి దాటింది.

బాధ్యత ఎవరిది

ఈ కేంద్రం వద్ద రద్దీలో ఇరుక్కుపోయిన భక్తులు ఊపిరాడక అల్లాడిపోయారు. కాగా ఆ సమయంలో ఒక భక్తుడికి బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పడంతో గేట్లు ఓపెన్ చేశారు. వెంటనే మిగిలిన భక్తులు కూడా గేటు మీద పడటంతో తొక్కిసలాట జరిగిందని అధికారులు వెల్లడించారు. అయితే, అక్కడ డీఎస్పీ సరైన రీతిలో స్పందించని కారణంతో పాటుగా భక్తులతో విధుల్లో ఉన్న టీటీడీ, పోలీసు సిబ్బంది సరిగ్గా వ్యవహరించలేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ఘటన జరిగిన వెంటనే అందుబాటులో ఉన్న అంబులెన్సుల నిర్వాహకుల పైన ఫిర్యాదులు ఉన్నాయి. గాయపడిన వారిని సకాలంలో ఆస్పత్రికి తీసుకురాక పోవటంతో ప్రాణాపాయం ఏర్పడిందని చెబుతున్నారు.

ఘటన జరిగిన వెంటనే

ఘటన జరిగిన సమయంలో టీటీడీ, పోలీసు అధికారుల మధ్య సమన్వయం లోపం ఏర్పడిందని స్థానికులు వివరిస్తున్నారు. అయితే, ఇది అధికారుల వైఫల్యంగా టీటీడీ ఛైర్మన్ పేర్కొన్నారు. ఆరు లక్షల మందికి వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శనం కల్పిస్తామని.. టోకెన్ ఉన్నవారికే దర్శనం కు అనుమతిస్తామని పదే పదే చెప్పటంతో పెద్ద సంఖ్యలో భక్తులు టోకెన్ల కోసం తరలి వచ్చారు. కాగా, గతంలోనూ తొక్కిసలాట ఘటనలు ఉన్నాయి. కానీ, ప్రాణ నష్టం జరగలేదు. గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో యంత్రాంగం విఫలమైందనే ఆరోపణ లు ఉన్నాయి. దీంతో, ఈ రోజు తిరుపతి వస్తున్న చంద్రబాబు ఘటనకు విచారణకు ఆదేశించటం తో పాటుగా బాధితులకు పరిహారం ప్రకటించే అవకాశం ఉంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు