Search
Close this search box.

  ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుపై తేల్చేసిన కేజ్రివాల్-ఫుల్ క్లారిటీ..!

December 11, 2024 9:06 PM | Aditya369 News

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుపై తేల్చేసిన కేజ్రివాల్-ఫుల్ క్లారిటీ..!

సార్వత్రిక ఎన్నికల తర్వాత పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, బీజేపీ మధ్యే్ పోరు సాగింది. కానీ త్వరలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మరోసారి కాంగ్రెస్, బీజేపీ కంటే ఆప్ ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. అయితే మారిన పరిస్ధితుల నేపథ్యంలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దీనిపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ ఇవాళ క్లారిటీ ఇచ్చేశారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆప్ మధ్య సీట్ల పంపకాల చర్చలు తుది దశకు చేరుకున్నాయన్న ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. తొలుత ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించిన ఆప్.. ఆ తర్వాత పొత్తులో భాగంగా కాంగ్రెస్ కు 15 సీట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన అరవింద్ కేజ్రివాల్ అలాంటిదేమీ లేదని తేల్చిచెప్పేశారు. కాంగ్రెస్ తో పొత్తుకు అవకాశమే లేదని కేజ్రివాల్ క్లారిటీ ఇచ్చారు.

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని అరవింద్ కేజ్రివాల్ తేల్చిచెప్పేసారు. తమ సొంత బలంతోనే ఆప్ ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతోందని కేజ్రివాల్ ఎక్స్ లో వెల్లడించారు. అలాగే కాంగ్రెస్ తో పొత్తుకు ఎలాంటి అవకాశం లేదని కూడా తేల్చిచెప్పారు. దీంతో కాంగ్రెస్-ఆప్ మధ్య పొత్తు లేదని తేలిపోయింది. ఇప్పటికే ఆప్ ఢిల్లీ ఎన్నికల కోసం రెండు విడతలుగా అభ్యర్ధుల జాబితాల్ని కూడా విడుదల చేసింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు