ఏపీలో 400 పంచాయతీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 400 లక్షల భూరి విరాళం ప్రకటించారు. దీంతోపాటు వరద బాధితులకు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి రూ.2 కోట్లు విరాళ మిచ్చారు. పంచాయతీలకు ఇంత భారీ విరాళం ప్రకటించిన నాయకుడిగా పవన్ రికార్డు సృష్టించారు. ఈసందర్భంగా పవన్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై సమీక్ష చేశారు. ఏలేరు వరద నీటిని విడుదల చేసేముందు పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు ప్రాంత ప్రజలను,రైతులను అప్రమత్తం చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ను ఆదేశించారు. గొల్లప్రోలు శివారు జగనన్న కాలనీ, సూరంపేట రైల్వే స్టేషన్ ఏరియా, సీతానగరం, లక్ష్మణపురం, మల్లవరం , ఎ.విజయ నగరం,ఏకే మల్లవరం గ్రామాల వారిని అప్రమత్తం చేయాలన్నారు.ఏలేరు నీటి ప్రవహాంపై అప్రమ త్తంగా ఉండాలని టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజల్ని కోరారు.
