భారీ వర్షాలు కారణంగా కోనసీమ,తూర్పుగోదావరి జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు .ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో ఆయా జిల్లా కలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాకినాడ జిల్లాలో మాత్రం పాఠశాలలకు ముందస్తుగా ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో పాఠశాలలు పనిచేస్తున్నాయి
