గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ద్వారా 990 కోట్లు నిధులు విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పంచాయ తీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులతో ఆయన సచివాల యంలో నిర్వహించిన సమీక్షలో భవిష్యత్తు కార్యాచరణను వివ రించారు.జనవరి నుండి జన్మభూమి 2.0 ఉంటుందన్నారు. జల జీవన్ మిషన్ ద్వారా 500 కోట్ల నిధులు విడుదలవుతున్నాయని, గ్రామాల్లో వెలుగులు రాబోతున్నాయన్నారు.
