కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఇద్దరూ ఒకేసారి ఉరి వేసుకుని మృతి చెందడం సంచల రేకెత్తించింది. కాకినాడ జిల్లా జగ్గంపేట లోని జగనన్న కాలనీలో ఒక ఇంటిలో వివాహిత కన్నా బత్తుల సాయి ప్రసన్న, అవివాహితుడు పిండి నానాజీ లు కలిసి సహజీవనం చేస్తున్నారు. అయితే వీరి మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకే ఇంటిలో ఇద్దరు ఉరి తాళ్ళకు వేలాడడం సంచలనంగా మారింది. అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడం పరిశీలిస్తే, ఒకేసారి ఇద్దరూ ఉరి వేసుకుని చనిపోయారా.. ఒకరి చనిపోయారని భయంతో మరొకరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.జగ్గంపేట ఎస్సై రఘునాథరావు దర్యాప్తు చేస్తున్నారు.
