కాకినాడ జిల్లా అటవీశాఖ అధికారిణి ఎస్. భరణి రష్యాలోని ఎత్తైన శిఖిరాన్ని అధిరోహించి, భారత జెండాను శిఖరంపై ఎగురవేశారు. కొన్నేళ్లుగా భరణి పర్వతారోహకురాలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. గత ఏడాది కిలిమంజారో పర్వతాన్ని ఆమె అధిరోహించారు. తాజాగా ఐరోపాలోనే కాకస్ పర్వతాలలో ఎత్తైన 5642 మీటర్ల(సముద్రమట్టానికి) ఎల్బ్రస్ శిఖరంపై మన జాతీయ జెండాను ఎగురవేసి సత్తా చాటారు. ఎల్బ్రస్ ప్రపంచంలో ఎత్తైన పర్వతశిఖరాలలో పదవ స్థానంలో ఉంది. ఇది 10 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది.
