మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల ‘ఇరుముడి’తో డివోషనల్ టచ్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న రవితేజ.. ఇప్పుడు మరో డిఫరెంట్ జానర్లో సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే దర్శకుడు వివేక్ ఆత్రేయతో రవితేజ ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివేక్ ఆత్రేయ–రవితేజ కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రవితేజ ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన జానర్స్‌లో సినిమాలు చేసినప్పటికీ.. హారర్ జానర్‌ను మాత్రం పెద్దగా టచ్ చేయలేదు. దీంతో ఈ కాంబినేషన్‌పై ఆసక్తి పెరుగుతోంది.
అంతేకాదు.. ఈ సినిమాకు ‘తులాభారం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక దసరా సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాలో రవితేజకు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించనున్నట్లు తెలుస్తోంది. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీని ఈ సినిమాను నిర్మించనున్నట్లు టాక్.
మరి ‘ఇరుముడి’ తర్వాత రవితేజ–వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో రాబోయే ఈ హారర్ కామెడీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.








