Search
Close this search box.

  బన్నీ కొత్త జర్నీ స్టార్ట్..! గ్రాండ్‌గా ‘ICONZA’ ఓపెనింగ్..!

October 1, 2026 8:34 PM | Aditya369 News

బన్నీ కొత్త జర్నీ స్టార్ట్..! గ్రాండ్‌గా ‘ICONZA’ ఓపెనింగ్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. తన తాతయ్య, దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ‘ICONZA’ పేరుతో సరికొత్త క్రియేటివ్ ఆఫీస్ స్పేస్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తాతయ్య ఆశీస్సులతోనే ఈ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందంటూ బన్నీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

“A new space. A new chapter. A legacy that continues” అంటూ సోషల్ మీడియాలో ఈ కొత్త జర్నీకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఇక ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, అల్లు శిరీష్, అల్లు బాబీతో పాటు పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. క్రియేటివ్ ఆలోచనలు, కొత్త కాన్సెప్ట్స్, వినూత్న ప్రాజెక్టులకు వేదికగా ఉండేలా ‘ICONZA’ను రూపొందించినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా తన తాతయ్య జయంతి రోజునే ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ప్రత్యేకంగా నిలిచింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు, సినీ వర్గాల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మరి ‘ICONZA’ నుంచి బన్నీ ఎలాంటి కొత్త క్రియేటివ్ ప్రాజెక్టులను తీసుకురాబోతున్నారో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు