Search
Close this search box.

  రవితేజ వివేక్ ఆత్రేయ సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్..?

October 1, 2026 8:21 PM | Aditya369 News

రవితేజ వివేక్ ఆత్రేయ సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్..?

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల ‘ఇరుముడి’తో డివోషనల్ టచ్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న రవితేజ.. ఇప్పుడు మరో డిఫరెంట్ జానర్‌లో సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే దర్శకుడు వివేక్ ఆత్రేయతో రవితేజ ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివేక్ ఆత్రేయ–రవితేజ కాంబినేషన్‌లో రాబోయే ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రవితేజ ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన జానర్స్‌లో సినిమాలు చేసినప్పటికీ.. హారర్ జానర్‌ను మాత్రం పెద్దగా టచ్ చేయలేదు. దీంతో ఈ కాంబినేషన్‌పై ఆసక్తి పెరుగుతోంది.

అంతేకాదు.. ఈ సినిమాకు ‘తులాభారం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక దసరా సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాలో రవితేజకు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించనున్నట్లు తెలుస్తోంది. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీని ఈ సినిమాను నిర్మించనున్నట్లు టాక్.

మరి ‘ఇరుముడి’ తర్వాత రవితేజ–వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రాబోయే ఈ హారర్ కామెడీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు