న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ హిందీ మార్కెట్లో ఊహించని రీతిలో దుమ్మురేపుతోంది.
నార్త్‌లో పెద్దగా మల్టీప్లెక్స్ సపోర్ట్ లేకపోయినా.. హిందీ డబ్బింగ్ వెర్షన్ తొలిరోజే ఏకంగా రూ.2.15 కోట్ల నెట్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
అసలు విషయం ఏంటంటే.. పరిమిత సంఖ్యలో థియేటర్లలోనే విడుదలైన ఈ సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం నాని మార్కెట్ గురించి చర్చకు దారితీస్తోంది.
పోల్చి చూస్తే.. నేషనల్ మల్టీప్లెక్స్ చైన్లలో భారీగా విడుదలైన రామ్ చరణ్ ‘పెద్ది’ హిందీలో రూ.2.5 కోట్లు, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ రూ.5.2 కోట్లు నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.
అయితే ‘ది ప్యారడైజ్’కు అలాంటి భారీ మల్టీప్లెక్స్ సపోర్ట్ లేకపోయినా రూ.2.15 కోట్ల ఓపెనింగ్ రావడం ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా ఒడిశా, ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో సినిమాకు మంచి స్పందన కనిపించింది. ఒక్క ఒడిశా నుంచే రూ.30 లక్షలకు పైగా నెట్ కలెక్షన్స్ రావడం విశేషం.
మరి రాబోయే రోజుల్లో ‘ది ప్యారడైజ్’ హిందీ మార్కెట్లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.







