Search
Close this search box.

  తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’..! రిలీజ్ ఎప్పుడంటే..?

September 11, 2026 10:59 PM | Aditya369 News

తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’..! రిలీజ్ ఎప్పుడంటే..?

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో.. ఒక భాషలో తెరకెక్కిన సినిమాలను ఇతర భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయడం కామన్ అయిపోయింది. అయితే కొన్ని సినిమాలు మాత్రం మొదట ప్రాంతీయ భాషలో విడుదలై, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకున్న తర్వాత.. ఇతర భాషల్లోకి తీసుకొస్తున్నారు.

ఇప్పుడు ఇదే తరహాలో బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న ఓ భక్తి ప్రధానమైన చిత్రం తెలుగులోకి రాబోతుంది.

అదే ‘హనుమాన్ అంశ్’.

ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రం.. హిందీలో విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాను తెలుగులో కూడా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.

ముఖ్యంగా ఈ సినిమాను తెలుగులో విడుదల చేసే బాధ్యతలను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ విషయాన్ని చిత్ర నిర్మాత నమ్రతా సింగ్ స్వయంగా వెల్లడించారు. భక్తి, దైవిక అంశాలతో తెరకెక్కిన ఈ బయోపిక్ డ్రామాను తెలుగు ప్రేక్షకులకు కూడా అందించేందుకు త్రివిక్రమ్ చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు.

తెలుగు ప్రేక్షకులు ఎప్పటి నుంచో భక్తి, ఆధ్యాత్మిక నేపథ్య చిత్రాలను ఆదరిస్తున్న నేపథ్యంలో.. ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్‌పై కూడా ఆసక్తి పెరుగుతోంది. త్వరలోనే తెలుగు రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఇక సినిమా విషయానికి వస్తే.. డాక్టర్ విశాల్ చతుర్వేది రచన, దర్శకత్వం వహించడంతో పాటు స్వయంగా నిర్మించారు. స్వయంభు మీడియా నెట్వర్క్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది. పూర్ణిమ తివారి, చందన్ కే ఆనంద్, రాజు మిశ్రా, రిషికేష్ ధూబే, ఋషి పతాక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

కేవలం రూ.2 కోట్లలోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ఆగస్టు 7, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట్లో పెద్దగా వసూళ్లు రాకపోయినా.. బలమైన మౌత్ టాక్‌తో సినిమా క్రమంగా పుంజుకుంది.

మొదటి రోజు కేవలం రూ.10 లక్షల వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. మొదటి వారానికి రూ.48 లక్షల వరకు రాబట్టింది. కానీ ఆ తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ టాక్‌తో కలెక్షన్లు ఒక్కసారిగా పెరిగాయి.

ఐదో వారాంతం ముగిసే సమయానికి ఇండియాలో రూ.100 కోట్ల మైలురాయిని అందుకున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. దేశవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.193 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ఈ సినిమాను త్రివిక్రమ్ తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుండటంతో.. తెలుగు వెర్షన్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore