Search
Close this search box.

  ట్రైలర్ లేకుండానే థియేటర్లోకి నాని ‘ప్యారడైజ్’..?

September 11, 2026 10:56 PM | Aditya369 News

ట్రైలర్ లేకుండానే థియేటర్లోకి నాని ‘ప్యారడైజ్’..?

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్‌’. సెప్టెంబరు 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌పై హీరో నాని కీలక ప్రకటన చేశారు.

‘ది ప్యారడైజ్‌’కు ప్రత్యేకంగా ట్రైలర్‌ను విడుదల చేయబోమని నాని స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమా పనులు చివరి దశలో ఉన్నాయని, ట్రైలర్ కోసం నాలుగైదు రోజులు కేటాయిస్తే సినిమా ఫైనల్ పనులపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. సినిమా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం తమ దృష్టి మొత్తం సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయడంపైనే ఉందని నాని పేర్కొన్నారు.

ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెలపై నాని ప్రశంసలు కురిపించారు. ‘దసరా’తో పాటు ‘ది ప్యారడైజ్‌’ పాటలు కూడా ప్రేక్షకులకు నచ్చడానికి సంగీత దర్శకులతో పాటు శ్రీకాంత్‌ ఆలోచనా విధానం కూడా ముఖ్య కారణమని చెప్పారు. తనకు కావాల్సిన పాట ఎలా ఉండాలి, ఎవరితో పాడించాలి, ఎలాంటి సాహిత్యం ఉండాలనే విషయంలో శ్రీకాంత్‌కు పూర్తి క్లారిటీ ఉంటుందని నాని అన్నారు.

సినిమాలో తన లుక్ విషయంలోనూ శ్రీకాంత్‌ ఎలాంటి ప్రయోగాలకూ వెనుకాడలేదని నాని తెలిపారు. జడలు, చేతిపై టాటూతో కనిపించడం వంటి విషయాలపై తాను కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని చెప్పారు. సోషల్ మీడియా ట్రెండ్స్‌కు భయపడకుండా తన ఆలోచనను తెరపై చూపించే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అని నాని కొనియాడారు. సినిమా పట్ల అతడికి ఉన్న పట్టుదల, ప్రేమ తనకు ఎంతో గర్వంగా అనిపిస్తాయని పేర్కొన్నారు.

‘ది ప్యారడైజ్‌’ తన సినీ కెరీర్‌లోనే అత్యంత కష్టపడి చేసిన సినిమా అని నాని వెల్లడించారు. టీజర్‌లోని కొన్ని డైలాగ్స్‌ అర్థం కావడం లేదంటూ వచ్చిన విమర్శలపై కూడా స్పందించారు. కథలోని పాత్ర స్వభావం, సినిమాపై ఉన్న ఆసక్తి దెబ్బతినకుండా కొన్ని విషయాలను పూర్తిగా బయటపెట్టలేమని ఆయన వివరించారు.

అలాగే ‘ది ప్యారడైజ్‌’ను పాన్‌ ఇండియా సినిమా అని కాకుండా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేస్తున్నామని నాని తెలిపారు. తల్లీ కొడుకుల బంధం చుట్టూ కథ సాగుతుందని, సినిమాలో హింసతో పాటు బలమైన భావోద్వేగాలు కూడా ఉంటాయని చెప్పారు.

మరోవైపు సినిమా రన్‌టైమ్‌పై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల క్లారిటీ ఇచ్చారు. ‘ది ప్యారడైజ్‌’ మొత్తం 2 గంటల 49 నిమిషాల నిడివితో ఉండనుందని వెల్లడించారు. సినిమాలోని ‘ఏష నాగుల’ పాట కోసం ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తున్న సమయంలో కీర్తి సురేశ్‌ను సంప్రదించామని, ఆమె వెంటనే అంగీకరించారని తెలిపారు.

షూటింగ్ సమయంలో తనతో పాటు పలువురికి గాయాలయ్యాయని నాని చెప్పారు. అయితే అవి సినిమా షూటింగ్‌లో సాధారణంగా జరిగే విషయాలేనని పేర్కొన్నారు. సీనియర్ నటుడు మోహన్‌బాబుతో కలిసి పనిచేయడం మంచి అనుభవమని, ఆయనను దగ్గరగా చూస్తే తమ అభిప్రాయం పూర్తిగా మారుతుందని నాని అన్నారు.

ఇక సినిమా ప్రీమియర్ల విషయంలోనూ నిర్మాత సుధాకర్ చెరుకూరి క్లారిటీ ఇచ్చారు. ‘ది ప్యారడైజ్‌’కు ప్రీమియర్లు ఉంటాయని తెలిపారు. అయితే టికెట్ ధరల పెంపుపై మాత్రం ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.

మొత్తానికి ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore