Search
Close this search box.

  ‘ఇరుముడి’ రివ్యూ..! మాస్ మహారాజ్ మరోసారి మెప్పించాడా..?

August 21, 2026 9:05 PM | Aditya369 News

‘ఇరుముడి’ రివ్యూ..! మాస్ మహారాజ్ మరోసారి మెప్పించాడా..?

మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయ్యప్ప స్వామి భక్తుడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తండ్రి–కూతురి మధ్య ఉండే అనుబంధాన్ని యాక్షన్, ఎమోషన్‌తో మిళితం చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? రవితేజ మరోసారి తన నటనతో మెప్పించారా? తెలుసుకోవాలంటే పూర్తి రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథేంటి?
త్రినాథ్ (రవితేజ) తన భార్య కావేరి (ప్రియా భవానీ శంకర్), కూతురు మణికంఠ (బేబీ నక్షత్ర)తో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అయితే త్రినాథ్‌కు మద్యం అలవాటు ఉంటుంది. అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో మాత్రమే ఆయన పూర్తిగా మద్యానికి దూరంగా ఉంటాడు. మరోవైపు తన కూతురిపై అమితమైన ప్రేమ ఉన్న త్రినాథ్.. ఊరిలో కనిపించే ప్రతి అమ్మాయిలోనూ తన కూతురినే చూసుకుంటుంటాడు.

ఈ క్రమంలో హైస్కూల్‌లో చదువుతున్న ఓ అమ్మాయి అనుమానాస్పదంగా హత్యకు గురవుతుంది. ఆమె స్నేహితురాలు గాయత్రి ఎదుర్కొన్న సమస్యలు మణికంఠకు ఎలా తెలుస్తాయి? ఆ ఘటన త్రినాథ్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది? మద్యానికి బానిసైన త్రినాథ్.. ఇకపై తాగనని తన కూతురికి ఎందుకు మాట ఇచ్చాడు? స్కూల్‌లో అసలు ఏం జరుగుతోంది? అక్కడ జరుగుతున్న అన్యాయాలను త్రినాథ్ ఎలా ఎదుర్కొన్నాడు? తన కూతురి కోసం ఓ తండ్రిగా ఎంత దూరం వెళ్లాడు? అనేది సినిమా కథ.
ప్లస్ పాయింట్స్
‘ఇరుముడి’లో ప్రధాన ఆకర్షణ రవితేజ నటనే. అయ్యప్ప స్వామి భక్తుడిగా ఆయన కనిపించిన తీరు, పాత్రలో చూపించిన వేరియేషన్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో రవితేజ తన అనుభవంతో పాత్రకు బలాన్ని తీసుకొచ్చారు.

యాక్షన్‌తో పాటు తండ్రి–కూతురి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాకు మంచి బలంగా నిలిచాయి. ప్రియా భవానీ శంకర్ భార్య పాత్రలో మెప్పించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశంలో ఆమె నటన ఆకట్టుకుంటుంది.

స్వసికా విజయ్ తన పాత్రలో మంచి ఇంపాక్ట్ చూపించారు. కూతురి పాత్రలో నటించిన బేబీ నక్షత్ర కూడా చక్కగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. సాయికుమార్, అజయ్ ఘోష్‌తో పాటు ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

అయ్యప్ప మాల నేపథ్యంలో కథను నడిపిస్తూనే.. దానికి కమర్షియల్ అంశాలను జోడించిన విధానం బాగుంది. ముఖ్యంగా తండ్రి–కూతురి ఎమోషన్‌ను కథలో కీలకంగా మలిచారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయి.
మైనస్ పాయింట్స్
సినిమాలో బలమైన ఎమోషన్స్, యాక్షన్ ఉన్నప్పటికీ.. కథనం విషయంలో కొన్ని సన్నివేశాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించవు. ముఖ్యంగా కొన్ని చోట్ల సినిమా నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది.

సినిమాపై ఉన్న హైప్‌ను ప్రారంభం నుంచి చివరి వరకు ఒకే స్థాయిలో కొనసాగించలేకపోయారు. అలాగే సాయికుమార్, ఎమ్మెల్యే పాత్రలకు సంబంధించిన ట్రాక్‌ను మరింత బలంగా రాసి ఉంటే సినిమా మరింత ఆసక్తికరంగా ఉండేది.
సాంకేతిక విభాగం
సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ తన కెమెరా పనితనంతో ఆకట్టుకున్నారు. యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలక ఎమోషనల్ సీన్స్‌ను కూడా కథకు అనుగుణంగా అందంగా చిత్రీకరించారు.

ఎడిటింగ్ బాగుంది. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. పాటల పిక్చరైజేషన్ కూడా బాగుంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలకు మంచి ఎలివేషన్ ఇచ్చింది.

దర్శకుడు శివ నిర్వాణ కథను యాక్షన్, ఎమోషన్‌తో బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారు. తండ్రి–కూతురి బంధాన్ని ప్రధానంగా తీసుకుని కథను ఆసక్తికరంగా నడిపించారు. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. నిర్మాణ విలువలు తెరపై స్పష్టంగా కనిపిస్తాయి.
తీర్పు
‘ఇరుముడి’లో రవితేజ మాస్ యాక్షన్‌తో పాటు తండ్రిగా చూపించిన ఎమోషన్ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. రవితేజ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, శివ నిర్వాణ దర్శకత్వం, నటీనటుల ప్రతిభ, సాంకేతిక విభాగం పనితనం సినిమాకు ప్లస్‌గా నిలిచాయి.

అయితే కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం, కొన్ని ట్రాక్‌లు పూర్తిస్థాయిలో ఆకట్టుకోకపోవడం మైనస్‌గా అనిపిస్తాయి. మొత్తంగా యాక్షన్, ఎమోషన్‌తో తెరకెక్కిన ‘ఇరుముడి’ రవితేజ అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు