ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ వద్దకు రాకముందే పలువురు బిగ్ స్టార్స్ పేర్లు కూడా వినిపించాయి. అదే సమయంలో ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ నటించబోతున్నారంటూ గతంలో భారీగా రూమర్స్ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ప్రాజెక్ట్ అల్లు అర్జున్ చేతికి వచ్చినా.. విల్ స్మిత్ క్యాస్టింగ్‌పై మాత్రం అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
తాజాగా మరోసారి ‘రాకా’లో విల్ స్మిత్ జాయిన్ కానున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. గతంలో కూడా ఇదే తరహా వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఈసారి అయినా ఈ రూమర్స్ నిజమవుతాయా అనే ఆసక్తి నెలకొంది.
ఒకవేళ విల్ స్మిత్ నిజంగానే ఈ సినిమాలో భాగమైతే.. అల్లు అర్జున్ ‘రాకా’కు మరింత ఇంటర్నేషనల్ క్రేజ్ రావడం ఖాయం. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇది కేవలం రూమర్‌గానే చూడాలి. మరి అట్లీ, అల్లు అర్జున్ అండ్ టీమ్ ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేశారో చూడాలి.








