ప్రస్తుతం ఇండియన్ సినిమా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ మూవీపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ గ్లింప్స్‌కు కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో పూర్తి ఆల్బమ్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి మరింత పెరిగింది.
ఈ నేపథ్యంలో తాజాగా కీరవాణి ‘వారణాసి’ ఆల్బమ్‌పై కీలకమైన క్లారిటీ ఇచ్చారు. సినిమా ఆల్బమ్ చాలా గ్రాండ్‌గా ఉండబోతుందని చెప్పిన ఆయన.. ఇందులో మొత్తం ఆరు పాటలు ఉంటాయని వెల్లడించారు.
‘వారణాసి’ నుంచి ఇప్పటికే ‘రణ కుంభ’, ‘సంచారి’ పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సాంగ్స్‌కు మంచి స్పందన లభించడంతో.. మిగిలిన పాటలపై కూడా అంచనాలు పెరిగిపోయాయి.
కీరవాణి చెప్పిన లెక్క ప్రకారం ఆల్బమ్‌లో మొత్తం ఆరు పాటలు ఉండగా.. ఇప్పటికే రెండు విడుదలయ్యాయి. అంటే ఇంకా నాలుగు పాటలు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. మరి ఈ మిగిలిన పాటలను రాజమౌళి టీమ్ ఎప్పుడు రిలీజ్ చేస్తుంది? అవి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి.








