దర్శకుడు శ్రీను వైట్ల, హీరో శర్వానంద్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘జార్జ్ క్రిష్’. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో శర్వానంద్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది.
ఒక పాత్ర పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుండగా, మరో పాత్ర ప్రస్తుత కాలానికి సంబంధించిన రెగ్యులర్ హీరో క్యారెక్టర్‌గా ఉంటుందని తెలుస్తోంది. దీంతో శర్వానంద్ ఈ సినిమాలో సరికొత్త మేకోవర్‌తో ప్రేక్షకులను అలరించబోతున్నాడనే అంచనాలు పెరుగుతున్నాయి.
ఇక ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. మొదటి షెడ్యూల్ పూర్తయిన తర్వాత ప్రారంభమయ్యే రెండో షెడ్యూల్లో శర్వానంద్, భాగ్యశ్రీ బోర్సేపై కీలకమైన లవ్ సీన్స్‌ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు, ఈ సినిమాను వచ్చే సంక్రాంతి బరిలో నిలిపేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇటీవల శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వచ్చిన ‘విశ్వం’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఈ సినిమాతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని దర్శకుడు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు టాక్.
మరి శ్రీను వైట్ల–శర్వానంద్ కాంబినేషన్ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో, శర్వానంద్ రెండు పాత్రల్లో ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.








