Search
Close this search box.

  చిరంజీవి–బుచ్చిబాబు కాంబో..? సోషల్ మీడియాలో తెగ వైరల్..!

August 15, 2026 6:58 AM | Aditya369 News

చిరంజీవి–బుచ్చిబాబు కాంబో..? సోషల్ మీడియాలో తెగ వైరల్..!

మెగాస్టార్ చిరంజీవి, ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుందంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. బుచ్చిబాబు ఇప్పటికే చిరంజీవి కోసం ఓ పవర్‌ఫుల్ కథను సిద్ధం చేశారని, త్వరలోనే మెగాస్టార్‌కు కథ వినిపించబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. ప్రస్తుతం బుచ్చిబాబు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పైనే పూర్తిగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లోనే ఆయన బిజీగా ఉన్నారట. ప్రస్తుతం మరో హీరో కోసం కొత్త కథపై బుచ్చిబాబు వర్క్ చేయడం లేదని సమాచారం.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. దర్శకుడు బాబీతో చేయబోయే ప్రాజెక్ట్‌తో పాటు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు కూడా చిరు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటితో పాటు మరో రెండు కథలు కూడా చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా చిరంజీవి, బుచ్చిబాబు ఇద్దరూ తమ తమ కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్న సమయంలో వీరి కాంబినేషన్‌పై సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. చిరు–బుచ్చిబాబు కాంబోకు సంబంధించి ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదని, ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ రూమర్ మాత్రమేనని తెలుస్తోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు