మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. సాధారణ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న “పెద్ది” తర్వాత, స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో చేయబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించి ఇప్పటికే ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. సినిమా షూటింగ్ ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, రామ్ చరణ్ లుక్, హీరోయిన్ ఎంపిక వంటి అంశాలపై పలు వార్తలు వినిపిస్తున్నాయి.
“పెద్ది” కోసం సిద్ధం చేసిన బల్క్ లుక్ నుంచి చరణ్ క్రమంగా స్లిమ్ అవుతున్నారని సమాచారం. ఇక ఈ కొత్త ప్రాజెక్ట్‌లో ఇద్దరు హీరోయిన్లను తీసుకునే ఆలోచనలో చిత్రబృందం ఉందనే టాక్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అయితే హీరోయిన్ ఎంపికతో పాటు ఇతర కీలక వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది.








