టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మన శంకరవర ప్రసాద్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుని మంచి జోష్‌లో ఉన్నారు. ఈ సక్సెస్ తర్వాత ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై భారీ ఆసక్తి నెలకొంది.
త్వరలోనే చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో ఒక కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియమణి నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సంగీతాన్ని తమన్ , కెవిన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
ఇక ఈ సినిమా గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారని, ఇప్పటికే ఆయనతో చర్చలు కూడా ప్రారంభమయ్యాయని టాక్ వినిపిస్తోంది.
చిరంజీవి – అనిల్ కపూర్ మధ్య ఉన్న స్నేహబంధం కారణంగా ఈ ప్రాజెక్ట్‌కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. అన్ని అనుకూలంగా జరిగితే, ఈ మల్టీ స్టార్ కాంబినేషన్ ప్రేక్షకులకు ఒక స్పెషల్ ట్రీట్‌గా మారే అవకాశముంది.








