పాన్ ఇండియా స్టార్ Prabhas హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “ఫౌజీ” ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. Hanu Raghavapudi దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. మొదట ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, షూటింగ్ ఆలస్యంతో డిసెంబర్‌కు వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.
ఈ సినిమా షూటింగ్‌లో Prabhas బిజీగా ఉండగా, తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ఆయన మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారట. ప్రొఫెసర్, సైనికుడు, స్పై ఏజెంట్‌గా మూడు భిన్నమైన గెటప్స్‌లో ఆయన కనిపిస్తారని టాక్. ముఖ్యంగా ప్రొఫెసర్ పాత్రలో ప్రభాస్ కనిపించబోతుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
“ఫౌజీ” 1940ల బ్రిటిష్ కాలం నేపథ్యంలో సాగే పీరియాడిక్ వార్ డ్రామాగా రూపొందుతోంది. దేశం కోసం ప్రాణాలు అర్పించే ఓ సైనికుడి కథతో యాక్షన్, ఎమోషన్ మేళవింపుగా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. భారీ విజువల్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
ఈ సినిమాలో Imanvi హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమెకు ఇది డెబ్యూ మూవీ కావడం విశేషం. తొలి సినిమానే Prabhas సరసన నటించే అవకాశం రావడం ఆమెకు పెద్ద బ్రేక్‌గా భావిస్తున్నారు.
ఇప్పటివరకు టైటిల్ పోస్టర్ తప్ప పెద్దగా అప్డేట్స్ రాకపోయినప్పటికీ, సినిమా షూటింగ్ ఇప్పటికే 70% పూర్తి అయినట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్ కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో Prabhas మరోవైపు Sandeep Reddy Vanga దర్శకత్వంలో “స్పిరిట్” షూటింగ్‌కు సిద్ధమవుతుండగా, “కల్కి 2” పనుల్లో కూడా బిజీగా ఉన్నారు.








