Search
Close this search box.

  ఫాగింగ్ గ‌న్ నుండి మంట‌లు..జ‌నం ప‌రుగు

February 17, 2026 11:20 PM | Aditya369 News

ఫాగింగ్ గ‌న్ నుండి మంట‌లు..జ‌నం ప‌రుగు

కాకినాడ జిల్లా పిఠాపురం ప‌ట్ట‌ణంలో మున్సిప‌ల్ సిబ్బంది దోమ‌ల నియంత్ర‌ణ కోసం చేస్తున్న ఫాగింగ్ కు ఉప‌యోగించే గ‌న్ భ‌గ్గుమంది. పిఠాపురంలోని రామాసెంట‌ర్ వ‌ద్ద ఉన్న పార్క్ వ‌ద్ద సిబ్బంది ఫాగింగ్ చేస్తుండ‌గా ఒక్క‌సారిగా గ‌న్ నుండి మంట‌లు వ్యాపించాయి. దీంతో సిబ్బంది ప్రాణ‌భ‌యంతో గ‌న్‌ను దూరంగా విసిరేశాడు. మంట‌లు చూపి పార్కులో జ‌నం కంగారుప‌డ్డారు. తేరుకున్న త‌ర్వాత సిబ్బంది మంట‌ల‌ను ఆర్పివేశారు. చాలా కాలం నుండి వాడ‌కుండా, వాటి నిర్వాహ‌ణ స‌క్ర‌మంగా చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల గ‌న్ లోప‌ల ఏర్ప‌డ్డ ఇబ్బంది వ‌ల్లే మంట‌లు వ్యాపించిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల పాద‌గ‌య క్షేత్రంలో కుక్కుటేశ్వ‌ర‌స్వామి క‌ళ్యాణం రోజున కూడా ఉప‌యోగించిన ఫాగింగ్ గ‌న్ మోరాయించడంతో భ‌క్తుల‌కు దోమ‌పోటు త‌ప్ప‌లేదు. కాలం చెల్లిన వాటిని ఉప‌యోగించ‌డం వ‌ల్లే ఈప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయ‌ని అంటున్నారు.ఇలాంటి ప్ర‌మాద‌ సంఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత కూడా అధికారులు ఏలా స్పందిస్తార‌నేది చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు